శ్రావణి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివేది. చదువులో చురుగ్గా ఉండేది. సుమారు పదినెలల క్రితం సెలవుల కోసం ఇంటికి వచ్చింది. తల నెప్పిగా ఉంది నాన్నా... అంటే కసాయి తండ్రి ఈ చిన్నారికి తన కిడ్నీ వ్యాధికి సంబంధించిన మాత్రలిచ్చాడు. ఇవ్వడమే కాకుండా మరికొన్నింటినీ ప్యాక్ చేసి బ్యాగులో పెట్టి పంపించాడు. హాస్టల్‌కు వెళ్లిన తర్వాత తలనెప్పి వచ్చినప్పుడల్లా ఆ చిన్నారి ఈ మాత్రల్నే వాడింది. క్రమంగా పాపకు నోరు పడిపోయింది. తర్వాత వినికిడి శక్తీ కోల్పోయింది. గురుకుల పాఠశాల యాజమాన్యమూ నిర్లక్ష్యం వహించింది. పాపం జీవితం నాశనమైంది. ప్రస్తుతం ఆ పాపకు చదువుకోవాలని ఉన్నా... ఆరోగ్యం సహకరించడం లేదు.
Like this post? Then please subscribe to Cheyuta via RSS Feed or Email to get new posts directly to your inbox.
No comments:
Post a Comment