Friday, October 12, 2012

ఈ చిన్నారులకు సాయం చేయండి

ఈ చిన్నారుల పేర్లు శ్రావణి, అర్చన. వీరిది మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి గ్రామం. శ్రావణి నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివేది. చదువులో చురుగ్గా ఉండేది. సుమారు పదినెలల క్రితం సెలవుల కోసం ఇంటికి వచ్చింది. తల నెప్పిగా ఉంది నాన్నా... అంటే కసాయి తండ్రి ఈ చిన్నారికి తన కిడ్నీ వ్యాధికి సంబంధించిన మాత్రలిచ్చాడు. ఇవ్వడమే కాకుండా మరికొన్నింటినీ ప్యాక్‌ చేసి బ్యాగులో పెట్టి పంపించాడు. హాస్టల్‌కు వెళ్లిన తర్వాత తలనెప్పి వచ్చినప్పుడల్లా ఆ చిన్నారి ఈ మాత్రల్నే వాడింది. క్రమంగా పాపకు నోరు పడిపోయింది. తర్వాత వినికిడి శక్తీ కోల్పోయింది. గురుకుల పాఠశాల యాజమాన్యమూ నిర్లక్ష్యం వహించింది. పాపం జీవితం నాశనమైంది. ప్రస్తుతం ఆ పాపకు చదువుకోవాలని ఉన్నా... ఆరోగ్యం సహకరించడం లేదు.
అక్కకు వచ్చిన దుస్థితే ఎనిమిది నెలల తర్వాత చెల్లెలు శ్రావణికీ వచ్చింది. పదేళ్ల శ్రావణి అమ్మమ్మ ఊరిలో ఐదో తరగతి చదివేది. రెండు నెలల క్రితం నాన్న ఆంజనేయులు ఇచ్చిన మాత్రల ప్రభావంతో అక్క అర్చన లాగే బధిరురాలైంది.
అప్పంపల్లికి చెందిన వెంకటమ్మ తన కూతురు అరుణను పక్క గ్రామమైన బండ్రవల్లికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి వివాహం జరిపించింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఓ బాబు. అయితే ఆంజనేయులుకు కూతుళ్లపై మమకారం లేదు. సరిగా చూసుకునేవాడేకాదు.
వారిని చదివించడం కూడా వృథా అని భావించేవాడు. మేనమామ సహకారంతో శ్రావణి గురుకుల పాఠశాలలో చేరింది. అర్చనను అమ్మమ్మ చేరదీసింది. ఎలాగోలా సాగుతున్న వీరి జీవితాన్ని తండ్రే చిదిమేశాడు. తన కిడ్నీ వ్యాధి మాత్రలతో పిల్లల బంగారు భవిష్యత్తును చీకటిమయం చేశాడు.
సోషల్‌ మీడియాలో లక్ష|లాది మంది వివిధ విషయాలను షేర్‌ చేస్తుంటారు కదా... ఈ చిన్నారుల దీన గాథను కూడా షేర్‌ చేస్తే అది ఎందరికో చేరుతుంది. ఇందులో వైద్యులుండవచ్చు. మానవతావాదులుండవచ్చు. కష్టాల్లో, బాధల్లో ఉన్న వారికి సాయం చేయడం మనిషిగా మన ధర్మం. మన దేశంలో అపర కుబేరులున్నారు... కటిక దరిద్రులూ ఉన్నారు. చనిపోయిన తర్వాత ఈ ఆస్తులు, అంతస్తులూ ఏమీ వెంటరావు. కానీ... ఉన్నవాళ్లు తమకు తోచిన రీతిలో ఇలాంటి అభాగ్యులకు సాయం చేయడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన మానవతావాదులైన వైద్యులుంటే వారికి విషయం చెప్పండి. వారికి ఉచితంగా వైద్యం అందేలా చూడమనండి. లేదంటే ఈ చిన్నారులు జీవితాంతం మాటకు దూరమవుతారు. మనం ఒక్క ఐదు నిమిషాలు మాడ్లాడలేకుండా ఉండగలమా. వినకుండా ఉండగలమా... ఒక్కసారి ఆలోచించంచండి. వీరిని ఆదుకోండి.
పాపం ఆ పిల్లలకూ అందరిలా గలగలా మాట్లాడాలని ఆశగా ఉంది. ప్లీజ్‌ ఆదుకోండి.
వివరాలకు...
కుర్వ జోగిని వెంకటమ్మ
అప్పంపల్లి గ్రామం, చిన్న చింతకుంట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
వెంకటమ్మ సెల్‌ నెంబర్‌: 8499880084
మేనమామ సెల్‌ నెంబర్‌: 9059566743
This was also telecast on TV.

For non-telugu people:
This is the story of two unfortunate sisters Sravani and Archana from Mahabubnagar Appampalli. The elder sister Archana was studying in Nagarkurnool gurukul school till 8th standard and came to visit her father.  Her father does not like his daughters and does not take care of them. He always felt it unnecessary to send them to school. She complained of a headache
and her father gave her some medicines which he was using for his kidney problems. He also packed some of those medicines and sent them with her. Archana used
to use the same medicines whenever she had a headache and started loosing her speech. The school management were also unattentive and finally she lost her
hearing ability too. Now she can't speak, hear.

Her sister Sravani was being looked after by her grandmother and studied till 5th standard when she too fell victim to her father's tablets. She too can't hear right now. We share a lot of pointless stuff every day that actually doesn't benefit anyone. Please share this so that some one willing to help these kids in any form.
Contact:
Venkatamma 8499880084
Or kid's uncle 9059566743
Appampally, chinna chintakunta mandal, mahaboobnagar district

Update: I talked to Venkatamma over phone.  They were advised to consult the doctors at Sai Krishna Neuro Hospitals at Kacheguda, Hyderabad. Apparently they need 4-5 lakhs for the treatment.

Update(29/10/2012): Doctors(at NIMS, Hyd) have prescribed some medicines and asked them to come back after a month.


Like this post? Then please subscribe to Cheyuta via RSS Feed or Email to get new posts directly to your inbox.

No comments:

Post a Comment